ఇన్ఫోసిస్ పై చర్యలు తీసుకోండి : లేబర్ మినిస్ట్రీ
ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో ట్రైనీస్ లేఆఫ్ లపై కలగజేసుకోవాలని కర్నాటక లేబర్ కమిషనరును కేంద్ర లేబర్ మినిస్ట్రీ కోరింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలపై వివరంగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. NITES ఫిర్యాదు మేరకు రెండోసారి లేఖ రాసింది.
ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే మాకూ, ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వండి అని అందులో పేర్కొంది. మరో వైపు తాము నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదని కంపెనీ వాదిస్తోంది.