BREAKING: లష్కరే కమాండర్ హతం..!
బందిపొరా ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు సమాచారం. పహల్గామ్ ఘటన తర్వాత ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపును తీవ్రం చేశాయి. ఈ క్రమంలో బందిపొరాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఉగ్రవాది మృతిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.