పోస్టల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ
IPPB (ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్)లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేకుండానే సెలక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరితేదీ.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, ఇంటర్నల్ అంబుడ్స్మన్ వంటి ముఖ్యమైన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.