జగన్ ఇంటి వద్ద తప్పిన పెను ప్రమాదం
తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆకతాయిలు సిగ్గరెట్ తాగి పడేయటంతో రోడ్డు పక్కన ఎండిపోయిన మొక్కలకు నిప్పంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.
అప్రమత్తమైన సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పదుల సంఖ్యలో కార్లు పార్క్ చేసి ఉన్నా కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.