Breaking News: హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం

News Published On : Thursday, January 23, 2025 11:18 PM

హైదరాబాద్లోని కొండాపూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎంబి మాల్ సమీపంలోని మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కార్లు దగ్గమయ్యాయి. షోరూంలో ఉన్న ఎంప్లాయిస్ ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు.

ప్రధాన రోడ్డుపై షోరూం ఉండడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. షోరూం నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి.