సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
పలు దిగ్గజ టెక్ కంపెనీలు సాప్ట్ వేర్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. AIతో సగం మంది ఉద్యోగులతోనే డబుల్ రెవెన్యూ సాధించాలని తమ టీములను సవాల్ చేస్తున్నామని HCL టెక్ CEO విజయ్ కుమార్ చెప్పారు. ఇది టెక్ ఉద్యోగులను ఆందోళన కలిగిస్తోంది. Infy CEO సలిల్ పారేఖ్ ఆయనతో ఏకీభవించడం మరింత భయపెడుతోంది.
కంపెనీలన్నీ AI దారి అనుసరిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో సగం మందికి జాబ్స్ పోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వెస్ట్ నుంచి ప్రాజెక్టులు తగ్గి రెవెన్యూ మందగించిన వేళ మరెన్ని దుర్వార్తలు వినాల్సి వస్తోందోనని ఉద్యోగులు భయపడుతున్నారు.