విజయసాయిరెడ్డికి ఏపీ పోలీసుల నోటీసులు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవలే వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సీఐడీ అధికారులు ప్రస్తావించారు. మాజీ ఎంపీకి సీఐడీ ఎస్పీ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. హైదారాబాద్‍కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఏ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.