40 రోజుల్లో 81 మంది ఎన్ కౌంటర్
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో గత 40 రోజుల్లో మొత్తం 81 మంది ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. గత ఏడాది 217 మంది మావోలు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ప్రకటించారు.