మహిళలకు ఉచిత బస్సు: అంత వరకే ఉచితం
తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఇంకా ఈ పథకం అమలు చేయకపోవడంతో మహిళలు ఉచిత బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం శాసనమండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితమని మంత్రి వెల్లడించారు. ఉచిత బస్సు పథకం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని, అన్నవరం నుండి తిరుపతి వెళ్లాలని అనుకుంటున్నారని వైసిపి సభ్యుడు PV సూర్య నారాయణరాజు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే RTC ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.