ఏపీలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి కీలక ప్రకటన
ఏపీలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. E-KYC నిర్వహణ కారణంగా రేషన్ కార్డులకు సంబంధించిన సేవలు నిలిపేశామని తెలిపారు. కొత్త బియ్యం కార్డులు, కార్డుల విభజన సేవలు ప్రారంభించాలన్న ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని చెప్పారు.
ఏదైనా కారణాలతో కార్డు నుంచి సభ్యుల పేర్లు తొలగించాలనుకుంటే జేసీకి అర్జీ పెట్టుకోవచ్చని తెలిపారు. సొంత వాహనం కాకుండా ట్యాక్సీ కలిగిన వారికీ రేషన్ కార్డు పొందేందుకు అర్హత ఉందని వెల్లడించారు.