ఏపీ: స్కూల్లోనే పెళ్లి చేసుకున్న విద్యార్థులు

News Published On : Friday, February 7, 2025 07:49 PM

పదో తరగతి చదివే మైనర్ విద్యార్థులు తరగతి గదిలోనే వివాహం చేసుకున్న ఘటన మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చోటుచేసుకుంది. వివరాలు సేకరించడానికి వెళ్లిన మీడియాపై పాఠశాల కరస్పాండెంట్ విరుచుకుపడ్డారని మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనతో యాజమాన్యం హాస్టల్ నుంచి మైనర్ విద్యార్థులను ఇంటికి పంపించివేశారు. వరుస ఘటనలపై విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు.