అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందేభారత్ రైలు.. ప్రారంభించనున్న మోడీ
వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా పేరొంది. దీనిపై ఇక వందే భారత్ రైలు ప్రయాణం సాగించనుంది. న్యూఢిల్లీ నుంచి కశ్మీర్కు సరాసరి నడిచే వందేభారత్ రైలును ఈ నెల 19న మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కట్రా -శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3 గంటలకు తగ్గనుంది. ఇది జమ్మూను కశ్మీర్ ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.