నేడు అకౌంట్లోకి డబ్బులు
పీఎం-కిసాన్ పథకంలో భాగంగా ఈ రోజు (సోమవారం) రైతుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున దేశవ్యాప్తంగా 9.7 కోట్లమంది రైతులకు మొత్తం రూ.22వేల కోట్లను కేంద్రం జమ చేయనుంది.
2019లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలను కేంద్రం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ డబ్బులు రావాలంటే E-KYC తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.