19 మంది పిల్లలు పుట్టినా ఆపలేదు..
19 మంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె తన ఆశయాన్ని ఆపలేదు. పెళ్లై, పిల్లలు పుట్టినా జీవితం అయిపోయిందిలే అనుకోకుండా కష్టపడి తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. సౌదీ ఆరేబియాకు చెందిన హమ్లా అల్ రువైలీకి చదువంటే చాలా ఇష్టం. బాగా చదుకోవాలి అని కలలు కన్నా తలిదండ్రులు చిన్నప్పుడే పెళ్లి చేశారు. వరుస కాన్పుల్లో 19 పిల్లలకు జన్మనిచ్చింది. అయినా చదువు మీద ఆశ వదులుకోలేదు.
ఒక్కో కోర్స్ పూర్తి చేస్తూ బిజినెస్ స్టడీస్ లో పీహెచ్డీ పూర్తి చేసింది. పగలు ఇంటి పనులు, పిల్లల్ని చూసుకుంటూనే రాత్రి పూట చదివింది. చివరకు తన 40వ ఏటా డాక్టరేట్ పూర్తి చేసింది. ఆమె సంకల్పానికి అందరూ సెల్యూట్ కొడుతున్నారు.