పీరియడ్స్ వస్తే చూపించాలి.. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల అరాచకం
అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు KGBV పాఠశాలలో జరిగిన సామాజిక తనిఖీల్లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెలసరి సమయాల్లో సిబ్బందిని శానిటరి ప్యాడ్లు అడిగితే పీరియడ్స్ చూపించమంటున్నారని బాలికలు వాపోయారు. తల స్నానం చేస్తే రూ.100 ఇవ్వాలని బెదిరిస్తున్నారని తెలిపారు.
తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేపి తమతో చపాతీలు చేయిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. పురుగుల అన్నం పెడుతున్నారని, ఎలా తినాలని ప్రశ్నిస్తే మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు.