బాలయ్య బాబుకు పద్మభూషణ్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో నందమూరి నటసింహం బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
'పద్మభూషణ్' బాలకృష్ణ నట ప్రస్థానమిదే నటుడు ఎన్టీఆర్కు వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ సినీరంగంలో తనదైన మార్కును సృష్టించుకున్నారు. 14 ఏళ్ల వయసులో 'తాతమ్మ కల' (1974)తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, భైరవద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్, అఖండ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలో నటించారు. ఇప్పటి వరకు 109 సినిమాలు పూర్తి చేసుకున్నారు.