నేటి నుంచి కొత్త రూల్స్ అమలు
ఈ రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానుంది. ముగియనున్న 2024-25లో కంటే కొత్త 2025-26 ఆర్థిక సంవత్సరంలో అనేక ఆర్థిక, పన్ను సంబంధిత నిబంధనలు మారనున్నాయి.
- రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదు.
- ఇన్ యాక్టివ్ యూపీఐ నంబర్లు డీయాక్టివేట్ కానున్నాయి.
- క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో మార్పులు రానున్నాయి.
- ఏకీకృత పెన్షన్ పథకం అమల్లోకి రానుంది.
- రూ. 50,000 పైన ఉన్న చెక్కులకు పాజిటివ్ పే సిస్టమ్ రానుంది.
- ప్రీమియం హోటల్ బసలపై అధిక జీఎస్టీ వసూలు చేయనున్నారు.