జిల్లా జడ్జి నియామక పరీక్షలో ఒక్కరూ అర్హత సాధించలేదు
ప్రభుత్వ ఉద్యోగం పొందాలని లక్షలాది మంది ప్రయత్నిస్తుంటారు. అయితే, ఒడిశా జిల్లా జడ్జి నియామక పరీక్ష - 2024లో ఆశ్చర్యకర విషయం జరిగింది. ఆ పరీక్షలో ఎవ్వరూ అర్హత సాధించలేదు. ఈ పరీక్షకు అనేక మంది అభ్యర్థులు హాజరైనా, ఫలితాల్లో ఒక్క అభ్యర్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు.
దీనిపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పరీక్ష యొక్క ప్రామాణికతపై చర్చిస్తున్నారు. పరీక్షను నిర్వహించిన హైకోర్టు తదుపరి చర్యలపై సమీక్ష జరుపనుంది.