ట్రంప్ ఎఫెక్ట్: 30 వస్తువులపై సుంకం తగ్గించనున్న భారత్
ట్రంప్ టారిఫ్స్ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు భారత్ వివిధ రకాల ఉమశమన చర్యలకు ఉపక్రమించింది. 30 ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గించొచ్చని నొమురా నివేదిక అంచనా వేసింది. అమెరికాతో వాణిజ్య వివాదాలు రాకుండా ఈ వ్యూహం అనుసరించనుందని తెలిపింది.
బడ్జెట్లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, హైఎండ్ బైకులపై సుంకాలు తగ్గించడాన్ని ప్రస్తావించింది. మరికొన్నింటిపైనా తగ్గించొచ్చని తెలిపింది. భారత ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకే వెళ్తాయి. ఈ విలువ 2024 ఆర్థిక సంవత్సర జీడీపీలో 2.2 శాతానికి సమానం.