బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ కు జైపూర్లోని జిల్లా వినియోగదారుల సమస్యల పరిష్కార ఫోరం నోటీసులు జారీ చేసింది. విమల్ పాన్ మసాలా యాడ్లో నటించినందుకు ఈ నోటీసులు ఇచ్చింది.
ఆ యాడ్లో పలుకు పలుకులో కేసరి అని ప్రచారం చేసే సంగతి తెలిసిందే. ఇది తప్పుడు ప్రచారమని, కుంకుమపువ్వు లేనేలేదని ఆరోపిస్తూ యోగేంద్ర సింగ్ అనే వ్యక్తి ఫోరంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే మార్చి 19న తమ ముందు హాజరుకావాలని ఫోరం ఆ హీరోలను ఆదేశించింది.