భార్య వేధింపులు... సింగర్ ఆత్మహత్య
భార్యల వేధింపులు తట్టుకోలేక భర్తలు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభివన్ సింగ్ బెంగళూరులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెట్టిన మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ మృతుని తండ్రి బిజయ్ మారతహళ్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.