ప్రభుత్వ స్కూళ్ళకే తల్లికి వందనం?
ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల ఖాతాలో రూ.15 వేలు వేసేలా తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారికి వర్తింపజేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
డబ్బు చెల్లించే స్తోమత ఉన్న వారే ప్రైవేట్ స్కూళ్లల్లో పిల్లలను చదివిస్తారని, వారికి పథకం ఎందుకుని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి, మెరుగైన టీచర్లను నియమిస్తే అడ్మిషన్లు పెరుగుతాయని అంటున్నారు. మరో వైపు ఈ పథకం అందరికీ వర్తింపజేయాలని కొందరు కోరుతున్నారు.