టీడీపీకి చుక్కలు చూపిస్తున్న పవన్ కళ్యాణ్
ఏపీలో కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొంత కాలంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు.. టీడీపీలో టెన్షన్
పెంచుతున్నాయి. అప్పుడు హోం మంత్రి అనితను
ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నుండి మొన్నటి తిరుపతి
తొక్కిసలాట ఘటన వరకు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. పవన్ చెబితే చంద్రబాబు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అనే చర్చ ఇప్పుడు టీడీపీలో మొదలైంది.