వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి సంచలన వాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి పేపర్ వర్క్ ప్రభుత్వం దగ్గర లేదని తెలిపారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్న దాఖలాలు అధికారికంగా లేనట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వాలంటీర్లను మభ్యపెట్టారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.