పవన్ కళ్యాణ్ కుమారుడి హెల్త్ అప్డేట్
సింగపూర్ లోని ఓ స్కూల్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. "నా కుమారుడు కోలుకోవాలని పూజలు చేసి ప్రార్థించిన మీకు ధన్యవాదములు. మన వాళ్ళ ఆశీస్సులతో, దేవుని దయతో మార్క్ ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది'' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.