కూటమి సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు
25 ఏళ్లుగా పింఛను తీసుకుంటున్న వారికీ అర్హత పరీక్షల పేరుతో ఇప్పుడు వేధింపులు మొదలయ్యాయి. ఈ ప్రభుత్వానికి ఏ రోగం వచ్చిందో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. మీఖర్మ కాలింది మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్న మీకు కూడా మా గతే పడుతుంది అంటూ దివ్యాంగులు కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.
దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అంటూ కళ్లు లేక కాళ్లులేక, ఇబ్బందులు పడుతున్న వారిని ఇంకా ఇబ్బందులు పెడుతోంది కూటమి సర్కార్.