చికెన్ ఫ్రీ.. ఎగబడిన జనం
చికెన్ వంటకాలు ఫ్రీ అనగానే జనం ఎగబడ్డారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పలువురు చికెన్ వాడకంపై అవగాహన కల్పిస్తూ చికెన్, ఎగ్ స్నాక్స్ ఫ్రీగా అందించారు. గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ గ్రౌండ్లో, హైదరాబాద్ లోని ఉప్పల్ గణేశ్నగర్ వద్ద ఫుడ్ మేళాలు నిర్వహించారు.
ఈ మేళాలకు జనాలు ఎగబడటంతో జనాల తాకిడికి నిర్వాహకులు చేతులెత్తేశారు. గుంటూరులో రద్దీ తట్టుకోలేక గేట్లు మూసేశారు. నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 70 డిగ్రీలలో ఉడికించి చికెన్ తినడం వల్ల ఏమీ కాదని ప్రభుత్వాలు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.