తిరుమల కొండపై మాంసాహార భోజనం: వెంకన్న సన్నిధిలో మళ్ళీ అపచారం

News Published On : Saturday, January 18, 2025 11:35 AM

కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై మరో అపచారం జరిగింది. కొందరు భక్తులు మాంసాహారం భుజిస్తూ పట్టుబడ్డారు. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు వెంకన్న సన్నిధిలో కొండపైకి కోడిగుడ్లు, మాంసాహార పలావ్ తీసుకొచ్చారు. రాంభగీచ బస్టాప్ వద్ద వారు ఈ నిషేధిత ఆహారపదార్థాలు తింటుండగా భక్తులు చూసి అధికారులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి వద్ద తనిఖీ సిబ్బంది డొల్లతనం వల్లే ఇలా జరిగిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.