నమ్మి మోసపోయా, న్యాయం చేయండి కేటీఆర్ సార్
ప్రేమ అని నమ్మి మోసపోయాను సర్, నాకు న్యాయం చేయండి అంటూ ఓ యువతి కేటీఆర్ దగ్గర కనీళ్లు పెట్టుకుంది. తనను కొన్నాళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటనాని కూడా చేప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు అని కేటీఆర్కు వివరించింది. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడని వాపోయింది. నెల రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని ఇప్పటికి ఏడాది గడుస్తున్నా ఆ మాటే ఎత్తడం లేదాని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ యువతి ఆవేధనను విన్న కేటీఆర్, సమస్య పరిష్కారానికి సహకరించాలని తెరాస మహిళా విభాగాన్నీ ఆదేశించారు. వనపర్తి జిల్లా వెల్లటూరుకు చెందిన అమ్మాయి కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ అనే అబ్బాయి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో త్వరలోనే పెళ్ళి కూడా చేసుకుంటానని ఆమెకు మాటిచ్చాడు. ఆ తర్వాత అశోక్ వివాహానికి నిరాకరించడంతో ఆమె కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆ యువకున్ని పిలిచి విచారించగా నెల రోజుల్లో ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని అతడు పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నాడు. ఈ మాట ఇచ్చి ఏడాది గడుస్తున్నా పెళ్లి చేసుకోవడం లేదని ఆమె తెలంగాణ భవన్ వద్ద బోరున విలపించింది,