ముద్రగడ కారు ధ్వంసం.. జనసేన కార్యకర్త అరెస్ట్

News Published On : Sunday, February 2, 2025 10:02 PM

కాపు నేత ముద్రగడ కారును ధ్వంసం చేసిన జనసేన కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటికి జనసేన పార్టీకి చెందిన గనిశెట్టి గంగాధర్ తెల్లవారుజామున మూడు గంటలకు ట్రాక్టర్‌తో వచ్చిన హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఇంటి ముందు పార్క్ చేసిన ముద్రగడ్డ కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టి గంగాధర్ ధ్వంసం చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడు గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.