వంశీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..?
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వంశీని పోలీసులు 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
విజయవాడ కోర్టు అర్ధరాత్రి తర్వాత ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో సబ్ జైలుకు తరలించారు. దీంతో ఆయన 27 వరకు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు వంశీ తరపు న్యాయవాదులు ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.