చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసుల నోటీసులు

News Published On : Wednesday, March 12, 2025 12:38 PM

మాజీ మంత్రి, వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రోజు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఆయనపై గతంలో కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బుధవారం ఒంగోలు వైసిపి కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...