జగన్ ఇంటికి పోలీసుల నోటీసులు

News Published On : Sunday, February 9, 2025 01:30 PM

తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం, వైసిపి కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల జగన్ నివాసం వద్ద అగ్నిప్రమాదం జరగిన సంగతి తెలిసిందే. దానికి సంబందించిన సిసి ఫుటేజీ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తుకు ఫుటేజీ కీలకమని భావిస్తున్నారు. అటు అగ్ని ప్రమాదం నేపథ్యంలో జగన్ భద్రతపై వైసిపి ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరో వైపు వాళ్లే తగలబెట్టుకొని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది.