ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పరిస్థితి విషయం.. అసలేమైంది?
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. బీపీఎస్సీ లో జరిగిన అవకతవకల మీద గత నాలుగు రోజుల నుండి ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు ప్రశాంత్ కిశోర్ దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నానికి అతడిని పాట్నా కోర్టులో ప్రవేశపెట్టారు.
అయితే కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. భవిష్యత్తులో ఎలాంటి చట్టవిరుద్దమైన నిరసనల్లో పాల్గొనని రాతపూర్వక హామీ ఇవ్వాలని కోర్టు సూచించింది. అయితే, ఇందుకు వ్యతిరేఖించిన పీకే రాతపూర్వక హామీ ఇవ్వకుండా జైలుకు వెళ్లడానికి సిద్దమయ్యారు. ఆ తరువాత జూడిషియల్ రిమాండుకు పంపారు. ఆ తర్వాత షరతులు లేని బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు. అయితే సోమవారం రాత్రి ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయులో చికిత్స తీసుకుంటున్నారు.