స్కూల్లో పాడు వీడియోలు చూస్తూ విద్యార్థులకు దొరికిన లేడీ టీచర్, ప్రిన్సిపల్

News Published On : Friday, January 31, 2025 03:00 PM

చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు క్లాస్ రూములో బరితెగించారు. అసభ్యంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ సీరియస్ అయింది. ఇద్దరిని తాత్కాలికంగా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసింది. ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి రాజేంద్ర కుమార్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించడానికి ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించారు. నివేదికను వారంలోపు సమర్పించాలని ఆదేశించారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల తమ దైన రీతిలో మండి పడుతున్నారు.