పులివెందులకు ఉప ఎన్నిక.. డిప్యూటీ స్పీకర్
మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి వచ్చి తన మనసులో ఉన్న మాట చెప్పాలని తెలిపారు.
ఏ శాసన సభ్యుడు అయిన అకారణంగా లేదా సెలవు కోరకుండా 60 రోజులు సభకు రాకుండా ఉంటే అనర్హత రేటు వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా, స్పీకర్, సీఎం పదవులను ప్రజలు మాత్రమే ఇస్తారని తెలిపారు. తనను కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసుపై మాత్రం పోరాటం అస్సలు ఆగదని స్పష్టం చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్ పాత్ర ఇప్పటికే స్పష్టమైందన్నారు. దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం తనకు ఉందని రఘురామ ధీమా వ్యక్తం చేశారు.