రేవతి కుటుంబానికి 2 కోట్లు ప్రకటించిన పుష్ప టీం
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఎఫ్‌డీసీ(Telangana Film development corporation) చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, సుకుమార్‌లు మరోసారి పరామర్శించారు.
ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు. పుష్ప-2 సినిమా హీరో అల్లు అర్జున్ రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, చిత్ర నిర్మాతలు(మైత్రీ మూవీ మేకర్స్) రూ.50 లక్షలు.. ఇలా మొత్తంగా రూ.2 కోట్ల చెక్కులను రేవతి కుటుంబానికి అందజేయనున్నారు. మరోవైపు బాలుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.