ఈ బ్యాంకులో 6 నెలల వరకు మనీ వేయటం తీయటం కుదరదు
న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ దివాలా తీయడంతో బ్యాంకు ఖాతా నుంచి 6 నెలల పాటు డబ్బులు తీయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం, ఫిబ్రవరి 13 నుండి న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ తన వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసింది, ఇది తదుపరి ఆరు నెలల పాటు కొనసాగుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ప్రకటన ప్రకారం, "బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పొదుపు లేదా కరెంట్ ఖాతా లేదా డిపాజిటర్ల ఇతర ఖాతాల నుండి ఎటువంటి డబ్బును విత్‌డ్రా చేయడానికి అనుమతించరు".
ప్రస్తుతం ముంబై కోర్టు న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ మోసం కేసులో ప్రధాన నిందితుడు హితేష్ మెహతా పోలీసు కస్టడీని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిమన్యు బోన్‌ను కూడా ఫిబ్రవరి 28 వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.