తిరుపతిలో భక్తుల మృతికి అసలు కారణం ఇదే

News Published On : Wednesday, January 8, 2025 11:36 PM

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 6 కి చేరింది. అయితే ఈ ఘటనకు గల అసలు కారణాలు స్థానికులు చెపుతున్నారు. అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే భక్తుల మృతి! తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోసం వచ్చి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినా వెంటనే అంబులెన్సులు ఘటనా స్థలానికి వచ్చి ఉంటే ఇంత మంది మరణించేవారు కాదని పలువురు భక్తులు పేర్కొంటున్నారు.