రికార్డు సృష్టించిన బంగారం ధర
అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజునే రూ.1650 పెరిగి రూ.98,100కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.1650 పెరిగి రూ.97,650 వద్దకు చేరింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.97,700కు చేరింది. అటు వెండి ధర కిలో ఒక్కరోజులో రూ.1900 మేర పెరిగి రూ.99,400కు చేరింది.