రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు రెండేళ్లకు కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలపై సంతృప్తిచెందని విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం...
1.ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) అధికారిక వెబ్‌సైట్ https://bieap.apcfss.in/ ను సందర్శించాలి.
2.దాంట్లో "Reverification / Recounting of marks" లింక్‌ను ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
3.హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడి వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
4.ఆ తర్వాత "Get Data" పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై కనిపించే మీ వివరాలను సరి చూసుకోవాలి.
5.మీరు రీ కౌంటింగ్ లేదా రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలి.
6.ప్రతి సబ్జెక్ట్‌కు రీ కౌంటింగ్‌కు, రీ వాల్యుయేషన్‌కు కొంత ఫిజు ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.
7.ఫీజు చెల్లించిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం స్క్రీన్‌పై కనిపించే అప్లికేషన్ నంబర్‌ను తప్పకుండా నోట్ చేసుకోవాలి.
ముఖ్యమైన విషయాలు..
రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు. మార్కులలో ఎలాంటి మార్పు లేకపోయినా సరే ఇవ్వరు. రీ వాల్యుయేషన్ తర్వాత వచ్చే మార్కులే తుది మార్కులుగా పరిగణించబడతాయి. రీ వాల్యుయేషన్ కోసం అప్లై చేసే విద్యార్థులకు వారి జవాబు పత్రాల స్కానింగ్ కాపీ కూడా అందిస్తారు.