రెండో పెళ్లి గురించి పవన్ కళ్యాణ్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణూ దేశాయ్ రెండో పెళ్లి గురించి పవన్ కళ్యాణ్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా పాడ్ కాస్ట్ లో తన రెండో పెళ్లి గురించి మాట్లాడగా సోషల్ మీడియా, వార్తాసంస్థల్లో అదే హాట్ టాపిక్ అయింది. దానిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. 'ఈ 44 ఏళ్ల మహిళ రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది సమాజానికి అక్కర్లేని అంశం. నేను మహిళలు, వాతావరణం, ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై మాట్లాడాను. అన్నీ వదిలేసి అనవసరమైన విషయంపై దృష్టి పెట్టారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.