మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గిడ్డంగులు ఏర్పాటు చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం మంది మహిళలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించుకుంటామని చెప్పారు.
మహిళా సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి చేర్చాలని, కోటి మందిని కోటీశ్వరులను చేస్తామని చెప్పారు. 15 నుండి 65 ఏళ్ల వయసు వారు మహిళా సంఘాల్లో ఉండాలని సూచించారు. మహిళా సంఘాల వ్యాపారాలకు, ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు ఇస్తామని ప్రకటించారు.