థ్యాంక్యూ సీఎం చంద్రబాబు గారు: రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఊరట కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన ప్రత్యేక లేఖలను అనుమతించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
గత కొన్నేళ్లుగా తిరుమల శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని తెలంగాణకు చెందిన పలువు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక నుండి వారానికి 4 లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు మరో రెండు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలను అనుమతించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎంవో అధికారిక ట్విట్టర్ ఖాతాలో రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు పరస్పరం రాసుకున్న లేఖలను షేర్ చేశారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
— Telangana CMO (@TelanganaCMO) December 30, 2024
✅తిరుమల శ్రీవారి ఆలయంలో… pic.twitter.com/10JrQuVWr0