దేశంలోనే రిచెస్ట్ సీఎం: మన నారా చంద్రబాబు
భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఏపి సీఎం నారా చంద్ర బాబు నాయుడు 931 కోట్ల రూపాయల ఆస్థితో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన చరాస్తుల విలువ 810 కోట్ల రూపాయలు కాగా స్థిరాస్తుల విలువ రూ. 121 కోట్లు. ఇక ఈ జాబితాలో అరుణాచల్ సీఎం 322 కోట్లతో రెండవ స్థానంలో, కర్ణాటక సీఎం 51 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. అతి తక్కువ ఆస్తులున్న సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యంత్రి మమత బెనర్జీ రూ. 15 లక్షలతో నిలిచారు. ఆ తర్వాత జమ్మూ & కాశ్మీర్ సీఎం ఒమర్ 55 లక్షలు, కేరళ సీఎం పినరయి విజయన్ ఒక కోటి రూపాయల ఆస్తి కలిగి ఉన్నారు.