పోరాడకుండా పందెం గెలిచిన కోడి
ఏం చేయకపోవడమూ మంచిదే అంటూ అప్పట్లో వచ్చిన 5 స్టార్ చాక్లెట్ యాడ్ గుర్తుందిగా. సేమ్ అలాగే ఓ పందెం కోడి పోరాడకుండానే గెలిచేసింది. 5 కోళ్లు బరిలో దిగగా 4 కోళ్లు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుని నేలకొరిగాయి. మొదటి నుంచి ఒకే చోట సైలెంటుగా నిలుచున్న కోడి విజేతగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కోడి తెలివైనదని కొందరు అంటుండగా... ఎప్పటికైనా అది కూరలా మారాల్సిందేనని మరికొందరు అంటున్నారు.