రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

News Published On : Saturday, April 12, 2025 01:45 PM

రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI లేదా ఇంజినీరింగ్ లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల వయసు ఈ ఏడాది జులై 1 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్, OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మే 11 చివరి తేదీగా ప్రకటించారు. మరిన్ని వివరాలకు www.indianrailways.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...