ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త
శనివారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అందులో ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖ తరఫున ఈ రాష్ట్రానికి ఏకంగా రూ.9,417 కోట్ల కేటాయింపులు చేసింది.
ఇటీవల కాలంలో ఒక రాష్ట్రానికి ఈ స్థాయి నిధులు కేటాయించడం ఇదే ప్రథమం. ఈ నిధులతో రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలగడంతో పాటు నిర్మాణంలో ఉన్నవి త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.