టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించినట్లు పేర్కొన్నారు.
ఉచిత ప్రయాణం కోసం విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే చాలని స్పష్టం చేశారు. కాగా మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.