శ్రీ తేజ్ ని పరామర్శించిన బన్నీ వాసు.. చికిత్స కోసం విదేశాలకు?

News Published On : Monday, February 3, 2025 03:40 PM

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీ తేజ్ కు ప్రభుత్వం తరఫున చికిత్స అందిస్తున్నారు. మరో పక్కన శ్రీ తేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ సంయుక్తంగా ఆర్థిక సహాయం కూడా అందించారు. 

ఇంకా శ్రీతేజ్ కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గీత ఆర్ట్స్ లో కీలకంగా వ్యవహరించే నిర్మాత బన్నీ వాసు హాస్పిటల్ కి వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శించారు. బన్నీ వాసు ఈ క్రమంలోనే ఆసుపత్రిలోని వైద్యులతో కూడా మాట్లాడారు. ఇక మెరుగైన వైద్యం కోసం శ్రీ తేజ్ ను విదేశాలకు తీసుకువెళ్లే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఆసుపత్రి వైద్యుల సలహా మేరకు విదేశాలకు తీసుకు వెళ్లాల్సి వస్తే వైద్య ఖర్చులు కూడా తామే భరిస్తామని ఆయన వెల్లడించినట్లు సమాచారం.